: కిడ్నీలో రాళ్లేమోనని ఆసుపత్రికి వెళ్తే... సర్జరీ చేసి పండంటి బిడ్డను చేతిలో పెట్టారు!


'కిడ్నీలో రాళ్లున్నట్టున్నాయి.. పొట్టలోను, వెన్నులోను నొప్పి వస్తోంది. కాస్త చూడండి' అంటూ ఆసుపత్రికి వెళ్లిన మహిళకు వైద్యపరీక్షలు నిర్వహించి, సిజేరియన్ చేసి ఆరోగ్యవంతుడైన బిడ్డను చేతిలో పెట్టిన అరుదైన ఘటన జార్జియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... జార్జియాలోని లోకస్ట్ గ్రోవ్ కు చెందిన టీవీ ఛానెల్ లో పని చేసే మైఖేల్ జాగర్స్, స్టెఫానీ జాగర్స్ దంపతులకు జాకబ్ (16), డిలాన్ (11) శాడీ (2) అనే పిల్లలున్నారు. స్టెఫానీ జాగర్స్ కు అప్పుడప్పుడు కడుపులో, వెన్నులో నొప్పివస్తుండేది. పిరీయడ్స్ కూడా ఏనాడూ క్రమం తప్పలేదు. దీంతో కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, అందుకే తనకు నొప్పి వస్తోందని భావించిన ఆమె, ఓ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ ను కలిసింది. వైద్య పరీక్షలు చేసిన టెక్నీషియన్లు స్కాన్ చేసి, గర్భందాల్చి ఎన్నాళ్లైందని ప్రశ్నించారు. దీంతో 'నేను ప్రెగ్నెంట్ ఏమిట్రా?' అంటూ అతన్ని లాగి ఒక్కటిచ్చింది. కిడ్నీ రాళ్ల సమస్య అని వస్తే, గర్బం దాల్చానంటూ అబద్ధాలు చెబుతావా? అంటూ గొడవ పడింది. దీంతో ల్యాబ్ టెక్నీషియన్ రిపోర్టులు చూపించింది. దీంతో వైద్యులు ఆమెకు సర్జరీ చేసి, పండంటి బాబును బయటకి తీసి ఆమె చేతిలో పెట్టారు. దీంతో వారికి క్షమాపణలు చెప్పిన ఆమె, ఆనందంలో మునిగిపోయింది. గర్భం దాల్చినట్టు తెలియకపోవడంతో బిడ్డ ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేస్తోంది. బిడ్డ తండ్రి మాట్లాడుతూ, తండ్రిని కాబోతున్నానన్న అనుభూతిని తొమ్మిది నెలలపాటు అనుభవించాల్సిన తనకు అది కేవలం అరగంటసేపు మాత్రమే దక్కిందని మైఖేల్ తెలిపాడు. అయితే ఇలా అరుదుగా మాత్రమే జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News