: విశాఖకు రైల్వే జోన్ కోసం అరుణ్ జైట్లీని కలుస్తా: అయ్యన్నపాత్రుడు
విశాఖపట్టణాన్ని ఎంతో కాలంగా ఊరిస్తూ వస్తున్న రైల్వే జోన్ విషయంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలుస్తామని ఏపీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్రుల ఆకాంక్ష అని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా, విశాఖకు రైల్వే జోన్ రావాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకోసం పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై టీడీపీ అశ్రద్ధ చూపదని ఆయన అన్నారు. ప్రజాశ్రేయస్సుకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.