: మూడు నిమిషాల్లో వరుసగా 122 సెల్ఫీలు.. గిన్నిస్‌ రికార్డు


ప్రస్తుత కాలంలో సెల్ఫీల ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెల్ఫీలకున్న క్రేజ్ తారస్థాయికి చేరింది. అదే సెల్ఫీలతో అమెరికాకు చెందిన డాన్నీ వాల్‌బర్గ్ అనే గాయకుడు గిన్నిస్‌రికార్డు సాధించాడు. నడుస్తోన్న ట్రెండుకు తగ్గట్లుగానే ఆయ‌న‌కు కూడా సెల్ఫీలంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే గిన్నిస్‌ రికార్డును కొట్టేయాల‌ని ప్ర‌య‌త్నించి విజ‌యం సాధించాడు. గిన్నీస్ రికార్డు సృష్టిస్తామ‌ని నిర్వాహ‌కుల‌ను పిలిచి మెక్సికోలోని కోజుమెల్‌లో సముద్ర ప్రయాణంలో ఓ ప్ర‌యోగం చేశాడు. స‌ముద్రంలో అతనితో పాటు నౌకలో ప్రయాణిస్తున్న వారంద‌రూ వరుసలో నిలబడి అతనితో సెల్ఫీలు తీసుకున్నారు. కేవలం మూడు నిమిషాల్లో వరుసగా 122 సెల్ఫీలు దిగి రికార్డు నెల‌కొల్పాడు. ఇటువంటి రికార్డు కోస‌మే ఇంతకు ముందు వాల్‌బర్గ్ ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడ‌ట‌. గ‌తంలో ఈ రికార్డు 119 సెల్ఫీలు తీసుకున్న సింగ‌పూర్‌కు చెందిన అరుబా పేరిట ఉండేది. ఇప్పుడు వాల్‌బర్గ్ చేసిన ప్ర‌య‌త్నంతో గ‌త రికార్డును అధిగ‌మించాడు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు న్యాయనిర్ణేత సారా కాసన్ ఈ రికార్డును ప‌ర్య‌వేక్షించి అత‌డికి స‌ర్టిఫికెట్‌ను అందించారు.

  • Loading...

More Telugu News