: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మా అదుపులో లేడు: విశాఖ రూరల్ ఎస్పీ
మావోయిస్టు అగ్ర నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే తమ అదుపులో లేడని విశాఖపట్టణం రూరల్ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. ఆర్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న వార్తలను ఆయన ఖండించారు. తప్పించుకున్న మావోయిస్టులకు కోడ్ లాంగ్వేజ్ ద్వారా ప్రజాసంఘాలు సమాచారం చేరవేస్తున్నాయని అన్నారు. ఇప్పటివరకు 30 మంది మావోయిస్టులు చనిపోయారని, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలోనే పోస్ట్ మార్టం జరిగిందని రాహుల్ దేవ్ శర్మ పేర్కొన్నారు.