: తీసుకున్న అప్పు తీర్చలేదంటూ మహిళపై టీడీపీ నాయకుడి దౌర్జన్యం


తీసుకున్న అప్పు తీర్చని మహిళపై టీడీపీ నాయకుడు దౌర్జన్యం చేసిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది. స్థానికంగా వ్యాపారం చేసుకునే యశోదమ్మకు టీడీపీ నాయకుడు ఇస్మాయిల్ గతంలో రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తీసుకున్న అప్పు తీర్చాలంటూ యశోదమ్మపై దౌర్జన్యానికి దిగాడు. ఆమె షాపులోని సుమారు రూ.2 లక్షల విలువ చేసే జీన్స్ వస్త్రాలను తీసుకెళ్లినట్లు యశోదమ్మ ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇస్మాయిల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News