: మేము విడిపోలేదు... అతనితో ఇద్దరు పిల్లల్ని కంటా!: అలియా భట్


బాలీవుడ్ యువనటి అలియా భట్ తన ప్రేమపై స్పష్టత ఇచ్చింది. ఇంత వరకు ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ఎప్పుడు ప్రశ్నించినా.. తామిద్దరం మంచి స్నేహితులమని, తొలి సినిమా కలిసి చేయడంతో తమ మధ్య లేనిపోని సంబంధాలు అంటగడుతున్నారని ఈ ఇద్దరూ చిలకపలుకులు పలికినవారే. అయితే శ్రద్ధా కపూర్ తో సిద్ధార్థ్ మల్హోత్రా సినిమా చేసినప్పటి నుంచి వారి మధ్య అనుబంధం పెరిగిందన్న వార్తలతో, వీరిద్ధరి మధ్య దూరం పెరిగింది. దీనిపై ముంబైలో మీడియా ప్రతినిధి అలియాను ప్రశ్నించాడు. దీంతో మండిపడ్డ అలియా భట్ ‘‘అవును, మేమిద్దరం రెండు సంవత్సరాల నుంచి డేటింగ్ చేస్తున్నాం. అతను నా జీవితంలో సగభాగం. మేము విడిపోలేదు, అతనితో నేను ఇద్దరు పిల్లల్ని కంటాను. నీకేమన్నా అభ్యంతరమా?’’ అని ప్రశ్నించింది. దీంతో ఆ మీడియా ప్రతినిధి అవాక్కయ్యాడు. కాగా, షారూఖ్ తో కలసి అలియా నటించిన 'డియర్ జిందగీ' నవంబర్ 2న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News