: నేనే కనుక లేకపోతే అఖిలేష్ కు అప్పుడు వివాహమయ్యేది కాదు: అమర్ సింగ్
తానే కనుక లేకపోతే అఖిలేష్ యాదవ్ కు పెళ్లి జరిగేది కాదంటూ నాటి విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ ప్రస్తావించారు. అఖిలేష్ వివాహాన్ని వారి కుటుంబసభ్యులు వ్యతిరేకించిన సందర్భంలో ఆయనకు మద్దతుగా నిలిచింది తానొక్కడినేనని, తన దయ వల్లే అఖిలేష్ పెళ్లి జరిగిందంటూ చెప్పుకొచ్చారు. లక్నోలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అఖిలేష్ తనను ‘దలాల్’ అంటూ సంభోదించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే అఖిలేష్ పెళ్లి నాటి విషయాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యమంత్రిగా ఉన్న అఖిలేష్ తో తాను ఉండకపోవచ్చుగానీ, ములాయం కుమారుడు అఖిలేష్ వెంటే తానెప్పుడూ ఉన్నానని అన్నారు.