: ఇమ్రాన్ ఎఫెక్ట్... ఇస్లామాబాద్ లో నిషేధాజ్ఞలు


ప్రధాని నవాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా నవంబర్ 2న ఇస్లామాబాద్ ముట్టడికి తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ పిలుపునిచ్చారు. నవాజ్ కుటుంబ సభ్యులకు భారీగా అక్రమాస్తులు ఉన్నాయని పనామా పేపర్లు వెల్లడించాయని... వాటిని కాపాడుకునే క్రమంలో, దేశ పాలనను గాలికొదిలేశారని ఇమ్రాన్ ఆరోపించారు. ఆయన వెంటనే పదవికి రాజీనామా చేయాలని... లేకపోతే దిగిపోయేంతవరకు ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, నవంబర్ 2 దగ్గరపడుతున్న కొద్దీ పాకిస్థాన్ లో ఉద్రిక్తత పెరుగుతోంది. ఈ క్రమంలో, ఇస్లామాబాద్ లో నిషేధాజ్ఞలను విధించారు. రెండు నెలల పాటు ఎలాంటి సభలు, సమావేశాలు, బహిరంగ కార్యక్రమాలు, ర్యాలీలు,ఆందోళనలు నిర్వహించరాదంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆజ్ఞలను ఉల్లంఘిస్తే జైల్లో పెడతామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News