: అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆటో డ్రైవర్‌కు చెప్పుతో బుద్ధి చెప్పిన మహిళ
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ మహిళ తనను వేధిస్తోన్న ఆటోవాలాకు గట్టిగా బుద్ధి చెప్పింది. స్థానిక రామారావు పేటలో ఓ అపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న ఓ మహిళతో నాగరాజు అనే ఆటో డ్రైవర్ రోజూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తన వెంటపడవద్దని ఆమె ఎంత చెప్పినా నాగరాజు వినిపించుకోలేదు. దీంతో సహనం కోల్పోయిన ఆ మహిళ స్థానికుల సాయంతో ఆటోడ్రైవర్‌కి దేహశుద్ధి చేసింది. చెప్పుతో కొట్టి, ఇకనైనా బుద్ధి తెచ్చుకోమని చివాట్లు పెట్టింది. సదరు మహిళ తిరగబడడంతో ఆటో డ్రైవర్ తనను కొట్టవద్దని వేడుకున్నాడు. చేతులెత్తి దండం పెట్టాడు.