: తాము పెళ్లి చేసుకోలేదని లబోదిబోమంటున్న కన్నడ నటి, సినీ రచయిత


'మేము పెళ్లి చేసుకోలేదు బాబాయ్' అంటూ కన్నడ చిత్ర నటి శోభా పూంజా, సినీ రచయిత నాగేంద్ర ప్రసాద్‌ లబోదిబోమంటున్నారు. శోభ పుంజాను నాగేంద్ర ప్రసాద్ వివాహం చేసుకున్నాడంటూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారి అభిమానులు 'హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌' అంటూ వారి ఫేస్‌ బుక్‌ లో పోస్ట్‌ లు చేస్తున్నారు. అయితే చిత్రీకరణ దశలోనున్న కన్నడ చిత్రంలో నటిస్తున్న సందర్భంగా వీరు దిగిన ఫొటోలను కొంత మంది సామాజిక మాధ్యమాల్లో అప్‌ లోడ్‌ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, తనకు ఇదివరకే వివాహమైందని, ఈ విషయం తెలియని కొంత మంది అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. శోభా పూంజా మాట్లాడుతూ, ఇంకా పేరుపెట్టిన సినిమాలో నటించిన సన్నివేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి తన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News