: మాల్యాకు చెందిన ఎయిర్ బస్ ఏ319 వేలానికొచ్చింది!


విదేశాలకు పారిపోయిన లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాకు చెందిన కార్పొరేట్ జెట్ ఎయిర్ బస్ ఏ319ను వేలం వేయనున్నారు. తమకు బకాయి పడ్డ రూ. 535 కోట్లను రికవరీ చేసుకోవడానికి సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వచ్చే నెల 28, 29 తేదీల్లో విమానాన్ని వేలం వేయనుంది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న ఈ జెట్ ను సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ ఏజెంట్ ఎంఎస్టీసీ వేలం వేయబోతోంది. వేలం పాటలో పాల్గొనే ఇండియన్ బిడ్డర్స్ నవంబర్ 27లోగా రూ. కోటి (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ - ఈఎండీ) జమ చేయాల్సి ఉంటుంది. విదేశీ బిడ్డర్స్ అయితే లక్షా 52 వేల డాలర్లు జమ చేయాల్సి ఉంటుంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ను విజయ్ మాల్యా నిర్వహించే సమయంలో... ప్రయాణికుల నుంచి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేసినప్పటికీ, దాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయలేదు. ఈ నేపథ్యంలోనే, ఆయన విమానాన్ని వేలం వేస్తున్నారు.

  • Loading...

More Telugu News