: మోదీకి గొప్ప శారీరక బలం ఉంది: కాంగ్రెస్ నేత శశి థరూర్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఉన్నట్టుండి ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీలో తనకు నచ్చే అంశాల్ని వివరించారు. మోదీ వ్యక్తిగత సత్తాగల నేత అని, ఆయనకు గొప్ప శారీరక బలం ఉందని అన్నారు. దేశంలోనే కాక విదేశాల్లోనూ ఎన్నో పర్యటనలు చేస్తోన్న మోదీ కొంచం కూడా అలిసిపోవడం లేదని కొనియాడారు. మోదీ తరచూ సమావేశాలలో పాల్గొంటూ బిజీ బిజీగా ఉంటారని, ఆయన వాగ్ధాటి, ఉత్సాహం కొంచం కూడా తగ్గడంలేదని శశి థరూర్ అన్నారు. మోదీ పట్ల తమకు ఎటువంటి అభిప్రాయం ఉన్నా, ఈ లక్షణం మాత్రం అభిమానించదగ్గదని వ్యాఖ్యానించారు.