: చెరువులను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు: మేయర్ బొంతు
హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించి అక్రమ కట్టడాలను నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని మేయర్ బొంతు రామ్మోహన్ హెచ్చరించారు. హస్మత్ పేటలోని బోయిన చెరువును జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, 67 ఎకరాల బోయిన చెరువు కబ్జాకు గురై 27 ఎకరాలకే పరిమితమైందన్నారు. నగరంలోని చెరువులన్నీ కొంత మేరకు కబ్జాకు గురయ్యాయని, చెరువులను కాపాడే బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలపై కూడా ఉందని బొంతు రామ్మోహన్ అన్నారు.