: మోసుల్ తుది పోరులో 900 మంది ఐఎస్ ఉగ్రవాదుల హతం


ఇరాక్ లో ఇంతకాలం నరమేధం సృష్టిస్తూ, నెత్తుటి ఏరులు పారించిన ఐఎస్ఐఎస్ ఖేల్ ఖతమవుతోంది. ఇరాక్ బలగాలతో కలసి సంకీర్ణ సేనలు జరుపుతున్న దాడితో ఐఎస్ ముష్కరులు చెల్లాచెదురవుతున్నారు. దేశంలో ప్రధానమైన మోసుల్ నగరానికి ఐఎస్ నుంచి విముక్తి కలిగించే దిశగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో ఇప్పటివరకు 800 నుంచి 900 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అడుగు కూడా వదలకుండా ఐఎస్ ఫైటర్స్ కోసం సంకీర్ణదళాలు జల్లెడ పడుతున్నాయి. ఇప్పటికే 78 పట్టణాలు, గ్రామాలను ఐఎస్ చెర నుంచి విముక్తి కల్పించాయి. ఈ సందర్భంగా రబియా పట్టణానికి చెందిన ఓ ట్రైబల్ నేత మాట్లాడుతూ, ప్రతి రోజు డజన్ల కొద్దీ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, వారి కుటుంబీకులు ఇరాక్ ను వదిలి సిరియాకు పారిపోతున్నారని చెప్పాడు.

  • Loading...

More Telugu News