: మీ నమ్మకాన్ని తిరిగి సాధించడమే ప్రస్తుత మా లక్ష్యం: శాంసంగ్


ఫైర్ ఫోన్ గా గుర్తింపు తెచ్చుకున్న గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లు కలిగించిన నష్టం శాంసంగ్ మూడో త్రైమాసికం ఆదాయాలను ఎనిమిదేళ్ల కనిష్ఠానికి పడగొట్టగా, తమ తక్షణ లక్ష్యం వినియోగదారుల్లో సంస్థ పట్ల తిరిగి నమ్మకాన్ని సాధించడమేనని శాంసంగ్ సహ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేకే షిన్ వ్యాఖ్యానించారు. కంపెనీ త్రైమాసిక ఫలితాలు సియోల్ లో నేడు విడుదల కాగా, సర్వసభ్య సమావేశానికి హాజరైన షేర్ హోల్డర్లకు ఆయన క్షమాపణలు చెప్పారు. టెక్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రొడక్ట్ ఫెయిల్యూర్ సంస్థను బాధించిందని అభివర్ణించిన ఆయన, ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నామని తెలిపారు. సమీప భవిష్యత్తులో సంస్థ ఆదాయం తిరిగి పూర్వపు స్థాయికి చేరుతుందని వివరించారు. కాగా, గడచిన మూడు నెలల కాలానికి సంస్థ ఆదాయం 87.63 మిలియన్ డాలర్లుగా నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 96 శాతం తక్కువ కాగా, 2008 నాలుగో త్రైమాసికం తరువాత ఇంత తక్కువ రెవెన్యూను శాంసంగ్ నమోదు చేయడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News