: బుమ్రాను సరదాగా అనుకరించిన కోహ్లీ.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న వీడియో


మైదానంలో బ్యాట్ పట్టి ఫోర్లు, సిక్సర్లు బాదుతూ చెలరేగిపోయే టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బయట మాత్రం ఎంతో స‌ర‌దాగా ప్ర‌వ‌ర్తిస్తాడు. త‌న తోటి ఆటగాళ్లపై జోకులు వేయడం, వారిని అనుక‌రించ‌డం అంటే ఆయ‌న‌కు భ‌లే ఇష్టం. అప్పుడప్పుడు నెట్‌లో ప్రాక్టీస్ చేస్తోన్న సంద‌ర్భంలోనూ ఆయ‌న ఇటువంటి స‌ర‌దాలు చేస్తుంటాడు. కోహ్లీ ఇలా తోటి ఆట‌గాడిని అనుక‌రిస్తున్నప్పుడు తీసిన‌ ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో షికార్లు కొడుతోంది. టీమిండియా బౌలర్ బూమ్రాను ప్రాక్టీస్ సెష‌న్ స‌మయంలో కోహ్లీ అనుకరించాడు. బుమ్రా బౌలింగ్ వేస్తున్న‌ప్పుడు ఎలా ఎలా చేతులుపైకి లేపుతాడో స‌ర‌దాగా చూపించాడు. అభిమానులు దీనిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News