: కేంద్ర ఉద్యోగులందరికీ మూడు రోజుల ముందే దీపావళి... 2 శాతం డీఏ పెంపు


దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 58 లక్షల మంది పింఛనుదారులకు మూడు రోజుల ముందుగానే దీపావళి వచ్చేసింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా దినసరి భత్యాన్ని 2 శాతం పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ భత్యాన్ని తదుపరి బేసిక్ వేతనంలో కలుపుతారన్న సంగతి తెలిసిందే. కాగా, కేంద్ర ఉద్యోగ సంఘాలు 3 శాతం డీఏ పెంచాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక గడచిన 12 నెలల వినియోగ ధరల సూచికలో మార్పుల ఆధారంగా 2.92 శాతం మేరకు ధరల పెరుగుదల సంభవించిందని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. ఇప్పుడీ 2 శాతం పెరుగుదల తమకు సంతృప్తిని కలిగించలేదని కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు కేకేఎన్ కుట్టీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News