: మా వస్తువులు నిషేధిస్తే మీకు ఇబ్బందే!: భారత్‌కు చైనా హెచ్చరికలు


భార‌త్ ప‌ట్ల చైనా ప్ర‌ద‌ర్శిస్తోన్న తీరుకి నిర‌స‌న‌గా భార‌తీయులు చైనా వ‌స్తువుల‌పై నిషేధం విధించాల‌ని ఉద్య‌మ రీతిలో ప్ర‌చారం చేస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై చైనా స్పందిస్తూ.. ఈ రోజు భార‌త్‌కు తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. త‌మ వ‌స్తువుల‌నే క‌నుక భార‌త్‌లో నిషేధిస్తే ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపడ‌మే కాకుండా, పరస్పర పెట్టుబడులను సైతం ఇది దెబ్బతీస్తుందని తెలిపింది. న్యూఢిల్లీలోని చైనా రాయబారి జీ లియాన్ ఈ అంశంపై స్పందిస్తూ... ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనుకున్న త‌మ దేశ‌ కంపెనీలపై ఈ అంశం ప్రభావం చూపుతుంద‌ని అన్నారు. భార‌త్, చైనా ప్రజలు ఇది కోరుకోవడం లేద‌ని పేర్కొన్నారు. చైనా నుంచి భార‌త్‌ అత్యధికంగా వివిధ వ‌స్తువులు దిగుమ‌తి చేసుకుంటోంది. అందుకే దక్షిణాసియాలో చైనాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భార‌త్ ఉంది. తాజాగా సోష‌ల్ మీడియాలో భార‌తీయులు చైనా ట‌పాసుల‌ను బ‌హిష్క‌రించాల‌ని పిలుపునిస్తున్నారు. దీంతో ఇరకాటంలో ప‌డుతున్న చైనా ఇటువంటి వ్యాఖ్య‌లు చేస్తోంది.

  • Loading...

More Telugu News