: ప్రజల ఆయుర్దాయం విషయంలో ముందున్న కశ్మీర్!
మన దేశంలో ఎక్కువ ఆయుర్దాయం కలిగిన ప్రజలు వున్న రాష్ట్రంగా జమ్మూకశ్మీర్ నిలిచింది. 2010 వరకు ఈ స్థానం కేరళది. తాజాగా, కేరళను వెనక్కి నెట్టి జమ్మూకశ్మీర్ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఈ వివరాలను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2010 నుంచి 2014 వరకు పలు దఫాలుగా జరిపిన అధ్యయనాల తరువాత ఈ నివేదిక రెడీ అయింది. పుట్టిన సమయంలో ఆయుర్దాయాన్ని తీసుకుంటే సగటున 74.9 ఏళ్లతో కేరళ మొదటి స్థానంలో నిలవగా, ఢిల్లీ రెండో స్థానంలో, జమ్మూకశ్మీర్ మూడో స్థానంలో నిలిచాయి. ఏడాది నుంచి నాలుగేళ్ల చిన్నారుల్లో అతి తక్కువ మరణాలు జమ్మూకాశ్మీర్ లో నమోదవుతున్నారు. అయితే, ఈ సర్వేను కేవలం 21 పెద్ద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే పరిమితం చేశారు.