: నిన్నటిదాకా చాయ్ వాలా, నేడు అందమైన భామల నడుమ ర్యాంప్ వాక్... మీరూ చూడండి!


ఇస్లామాబాద్ లోని ఓ మారుమూల ప్రాంతంలో టీ అమ్ముకుంటూ పొట్ట పోసుకుంటున్న నీలి కళ్ల కుర్రాడు అర్షద్ ఖాన్ గురించి తెలుసుగా? సోషల్ మీడియా పుణ్యమాని రాత్రికి రాత్రే మోడలింగ్ స్టార్ గా ఎదిగిన ఈ కుర్రాడి ముందు ఇప్పుడు అందమైన అమ్మాయిలు క్యూ కడుతున్నారు. సరికొత్త గెటప్ లోకి మారి మోడల్స్ తో కలసి ర్యాంప్ వాక్ చేస్తూ అదరగొడుతున్నాడు. పాక్ లోనే అత్యంత పాప్యులర్ అయిన టాక్ షో 'గుడ్ మార్నింగ్ పాకిస్థాన్'లో అర్షద్ చోటు దక్కించుకున్నాడు. దీనికోసం సరికొత్త స్టయిలిష్ లుక్ తో కనిపించేందుకు స్పెషల్ కేర్ తీసుకోగా, ఆ చిత్రాలిప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతున్నాయి. తొలిసారిగా అర్షద్ చిత్రాలు బయటకు వచ్చాక, అతని దశ తిరిగిపోగా, పలు కంపెనీలు ఇప్పుడతన్ని ప్రచారకర్తగా నియమించుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News