: టపాసుల మార్కెట్ ను తాకిన ములాయం ఇంటి గోల!
ఉత్తరప్రదేశ్ లో 'థౌజండ్ వాలా' అమర్ సింగ్ లా పేలుతుంది. రాకెట్లు సమాజ్ వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ లా, సీఎం అఖిలేష్ లా దూసుకెళ్తాయి. మతాబులు శివపాల్ యాదవ్ లా మండుతాయి. యూపీ ఫైర్ క్రాకర్ మార్కెట్లో ఇప్పుడు ములాయం కుటుంబ సభ్యుల బ్రాండ్ టపాకాయలే హాట్ ఫేవరెట్లు. అన్ని రకాల టపాకాయల బాక్సులపై ములాయం కుటుంబ సభ్యుల బొమ్మలే కనిపిస్తూ, వారింట ఏ మేరకు కుటుంబ రాజకీయాలు సాగుతున్నాయన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. 'అమర్ సింగ్ కీ ఫూల్ జరీ' (1000 వాలా), 'సమాజ్ వాదీ టేగా బార్' (రాకెట్లు), 'రాంగోపాల్ యాదవ్ కీ లాల్ మిర్చీ' వంటి వాటితో పాటు మోదీ బాంబ్, సర్జికల్ స్ట్రయిక్ రాకెట్ వంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదిలావుండగా, ఈ సీజనులో చైనా క్రాకర్లకు హోల్ సేల్ వ్యాపారుల నుంచి డిమాండ్ గణనీయంగా పడిపోయినట్టు తెలుస్తోంది.