: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఉన్మాది హల్‌చ‌ల్‌... టైమ్ ఎంతయిందని అడిగినందుకు బ్లేడుతో గాయపర్చిన వైనం


సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఈ రోజు ఓ ఉన్మాది క‌ల‌క‌లం రేపాడు. ఓ వ్య‌క్తిపై బ్లేడుతో దాడికి దిగి హ‌ల్‌చ‌ల్ చేశాడు. నిజామాబాద్‌ జిల్లా వాసి అయిన షరీఫ్ అక్క‌డి నుంచి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ఈ రోజు మ‌ధ్యాహ్నం సికింద్రాబాద్‌కి వ‌చ్చాడు. రైల్వేస్టేష‌న్‌లో ఫ్లాట్‌ ఫాంపై ఉన్న ఓ వ్యక్తిని టైమ్ ఎంత‌యింద‌ని అడిగాడు. దీంతో ఆ ఉన్మాది నన్నే సమయం అడుగుతావా? అంటూ ఓ బ్లేడుతో ష‌రీఫ్‌ను గాయ‌ప‌రిచి రెచ్చిపోయాడు. అనంత‌రం అక్క‌డి నుంచి పారిపోయాడు. రైల్వే పోలీసులు షరీఫ్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు న‌మోదు చేసుకొని ఉన్మాది కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News