: మిస్త్రీ వ్యాఖ్యలతో ఇన్వెస్టర్ల ప్యానిక్... 5 నుంచి 13 శాతం పడిపోయిన టాటా కంపెనీల ఈక్విటీలు, మొత్తం నష్టం రూ. 40 వేల కోట్లు


వారసత్వ సంస్థలను నష్టాల్లో నడుపుతున్న కారణంగా టాటా గ్రూప్ 18 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 1.18 లక్షల కోట్లు) రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుందని సైరస్ మిస్త్రీ చేసిన వ్యాఖ్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించగా, వరుసగా మూడవ రోజు కూడా టాటా గ్రూప్ కంపెనీల ఈక్విటీలు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిలో కూరుకుపోయాయి. టాటా పవర్, టాటా కమ్యూనికేషన్స్, టాటా కెమికల్స్, టాటా గ్లోబల్ బీవరేజస్, టాటా కాఫీ, టాటా ఇన్వెస్ట్ మెంట్స్ కార్పొరేషన్, టాటా టెలీ సర్వీసెస్, టాటా మెటాలిక్స్, టాటా స్పాంజ్ అండ్ ఐరన్ కంపెనీలు నేడు 5 నుంచి 13 శాతం వరకూ నష్టాల్లో నడుస్తున్నాయి. మిస్త్రీ తొలగింపు తరువాత టాటా గ్రూప్ కంపెనీలకు ఇప్పటివరకూ రూ. 40 వేల కోట్ల నష్టం సంభవించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 0.27 శాతం నష్టంలో కొనసాగుతుండగా, టాటా కంపెనీలు ఎన్నో రెట్ల నష్టాల్లోకి జారిపోయాయి. సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారిలో నెలకొన్న భయాందోళనలే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు వ్యాఖ్యానించాయి. కాగా, నేటి సెషన్ లో ఇండియన్ హోటల్స్ సంస్థ అత్యధికంగా 13 శాతం పతనమైంది.

  • Loading...

More Telugu News