: లంచ్ మోషన్ లో కుదరదు, రేపు చూద్దాం: కోమటిరెడ్డి పిటిషన్ పై హైకోర్టు
తెలుగు రాష్ట్రాల సచివాలయాన్ని పడగొట్టి కొత్త భవనాలు కట్టాలన్న కేసీఆర్ ఆలోచనను వ్యతిరేకిస్తూ, తక్షణం స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్ ను లంచ్ మోషన్ లో విచారణకు స్వీకరించలేమని, రేపు విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. సచివాలయ భవనాలు పాడుబడినవేమీ కాదని, కొత్త భవనాల నిర్మాణపు ఆలోచనతో ఎంతో ప్రజాధనం వృథా అవుతుందని తన పిటిషన్ లో కోమటిరెడ్డి పేర్కొన్నారు. భవనాలు కూల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.