: మాల్యాలా చేయకుండా బుద్ధిగా ఇండియాకు వచ్చేయ్: ఖురేషికి కోర్టు హితవు


లుకౌట్ నోటీసులు ఉండి, న్యూఢిల్లీలో అధికారులు అడ్డుకున్నప్పటికీ, వారికి తప్పుడు ఉత్తర్వులు చూపించి దుబాయ్ కి చెక్కేసిన మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషిని ఉద్దేశించి ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యాతో ఖురేషిని పోలుస్తూ, మాల్యాలా చేయవద్దని, విదేశాల్లో ఉండి, ఇండియాకు రాకుంటే, ఇక్కడి చట్టాలను గౌరవించని వ్యక్తిగా భావించాల్సి వస్తుందని పేర్కొంది. తొలుత దేశానికి వచ్చి పోలీసు విచారణకు సహకరించాలని హితవు పలికింది. నవంబర్ 22 నాటికి స్వదేశానికి వచ్చి ఈడీ అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశించింది. అంతకుముందు తనను అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఖురేషి వేసిన పిటిషన్ పై వాదనలు వింటూ, తాత్కాలిక ఆదేశాలు ఇవ్వలేమని, ఆయన వెంటనే భారత్ కు రావాల్సిందేనని తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News