: పాక్ లో శిక్షణ పొంది విధ్వంసమే లక్ష్యంగా... పంజాబ్ లోకి చొరబడ్డ సిక్కు తీవ్రవాదులు!


తీవ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సాకు చెందిన 12 మంది సభ్యులు పాకిస్థాన్ లో ఉగ్రవాద శిక్షణ తీసుకుని తిరిగి పంజాబ్ లోకి చొరబడ్డారని నిఘా వర్గాలు నేడు హెచ్చరించాయి. దీంతో పంజాబ్ వ్యాప్తంగా పోలీసు, భద్రతా బలగాలను అలర్ట్ చేసి, పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 23న పోలీసులు అరెస్ట్ చేసిన అనుమానిత ఉగ్రవాది కమల్ దీప్ సింగ్ ను విచారించిన పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకున్నారని సమాచారం. వీరంతా భారీ ఎత్తున ఆయుధాలు తీసుకుని పంజాబ్ లోకి వచ్చారని, ఎన్నికల వేళ విధ్వంసాలకు దిగడమే వీరి లక్ష్యమని, కాశ్మీర్ ప్రాంతానికి చెందిన కమల్ దీప్ వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. బబ్బర్ ఖల్సా తీవ్రవాదులను వెంటనే అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పంజాబ్ పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి సీనియర్ పోలీసు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా వీరిని అదుపులోకి తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News