: తిరుపతిలోని ఐ ఫోన్ దుకాణంలో భారీ చోరీ

దుండగులు భారీ ఎత్తున ఐఫోన్లను చోరీ చేసిన ఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్డులో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఐఫోన్ దుకాణంలో గత అర్ధరాత్రి ఈ చోరీ జరిగింది. దుకాణం తాళాలు పగులగొట్టిన దుండగులు అందులోకి ప్రవేశించి 35 లక్షల రూపాయల విలువైన ఐ ఫోన్లను చోరీ చేశారు. ఈ ఘటనపై దుకాణం సిబ్బంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.