: అమరావతి రహదారిపై స్వయంగా ధర్నాకు దిగిన తెలుగుదేశం!


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో రహదారుల స్థితిపై స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలకు దిగడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులు ఉన్నారు. ఈ ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో అమరావతి రోడ్డును తవ్వేశారని, దాన్ని వెంటనే వేయాలని డిమాండ్ చేస్తూ, టీడీపీ ధర్నాకు దిగింది. రెవెన్యూ డెవలప్ మెంట్ ఆఫీసర్ వచ్చి తమకు సమాధానం చెప్పేవరకూ కదలబోమని భీష్మించుకుని కూర్చుని నిరసనలు తెలియజేస్తుండటంతో ఈ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెనుమాక మీదుగా అమరావతికి వెళ్లే రహదారి విస్తరణ కోసం రోడ్డును తవ్వి రోజులు గడుస్తున్నా, పనులు మొదలు పెట్టడం లేదని వీరు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News