: మావోలు ప్రాణాలు పోయేవరకు పోరాడతారు.. ఆత్మాహుతి దాడి లేఖ చంద్రబాబు సృష్టే!: విరసం నేత కల్యాణ్ రావు
చంద్రబాబు కుటుంబంపై ఆత్మాహుతి దాడి చేస్తామని హెచ్చరిస్తూ మీడియాకు విడుదలైన లేఖ పచ్చి బూటకమని విరసం నేత కల్యాణ్ రావు విమర్శించారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిత్యమూ ప్రజల్లో ఉండే మావోయిస్టులు ఎన్నడూ ఆత్మాహుతి చేసుకోబోరని, ఆ లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డీజీపీ సాంబశివరావుల సృష్టేనని ఆరోపించారు. భగత్ సింగ్ లా పోరాడిన మున్నా అమరుడయ్యాడని, తన అమరత్వంతో గ్రామం పేరును చరిత్రలో నిలిపాడని కొనియాడారు. తెగించి ప్రాణాలు పోయే వరకూ పోరాడే మావోయిస్టులు ఆత్మాహుతి దాడులకు పాల్పడతారన్నది పచ్చి అబద్ధమని అన్నారు. బూటకపు ఎన్ కౌంటర్ కు పాల్పడి, 30 మందిని హతమార్చినందుకు ఏపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందని తెలిపారు.