: గూఢచర్యం చేస్తున్న పాక్ హైకమిషన్ ఆఫీసర్ అరెస్ట్
ఓవైపు ఇండియాలో దౌత్యాధికారి హోదాలో పనిచేస్తున్నట్టు నటిస్తూ, మరోవైపు ఇక్కడి సమాచారాన్ని రహస్యంగా పాక్ చేరవేస్తున్న అధికారిని ఢిల్లీ పోలీసులు నేడు అరెస్ట్ చేశారు. పాక్ హై కమిషన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఈ ఉద్యోగి గూఢచర్యం చేస్తున్నట్టు పసిగట్టిన నిఘా వర్గాలు ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు అతని ఇంట సోదాలు జరిపి అరెస్ట్ చేశారు. సోదాల్లో భారత సైన్యానికి చెందిన కీలక పత్రాలు ఆయన దగ్గర్నుంచి పట్టుబడటం గమనార్హం. ఈ అధికారిని ప్రస్తుతం విచారిస్తున్నామని, విషయాన్ని పాక్ అధికారులకు తెలిపామని ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి.