: రతన్ టాటా వర్సెస్ సైరస్ మిస్త్రీ... రంగంలోకి దిగిన సెబీ


వారసత్వ సంస్థలను నష్టాల్లో నడుపుతున్న కారణంగా టాటా గ్రూప్ 18 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 1.18 లక్షల కోట్లు) రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుందని సైరస్ మిస్త్రీ రాసిన లేఖతో టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఆందోళనకు గురికాగా, బీఎస్ఈ, ఎన్ఎస్ఈలు, సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) రంగంలోకి దిగింది. మిస్త్రీ రాసిన లేఖపై వెంటనే వివరణ ఇవ్వాలని టాటా కంపెనీలను సెబీ కోరింది. ఒకవేళ గతంలో ఏదైనా మొత్తాన్ని రద్దు చేసుంటే, వాటి పూర్తి వివరాలు తెలియజేయాలని, ఆ సమాచారం స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు తెలియజేయకుండా లావాదేవీలు జరిపివుంటే వాటి వివరాలు ఇవ్వాలని సెబీ ఆదేశించింది. ఈ మేరకు టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండియన్ హోటల్స్, టాటా టెలీసర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్ టాటా పవర్ సంస్థలకు నోటీసులను సెబీ పంపింది. కాగా, మిస్త్రీ తొలగింపు తరువాత వరుసగా నాలుగో రోజు సైతం టాటా గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు స్టాక్ మార్కెట్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. టాటా గ్రూప్‌ లోని లిస్టెడ్ కంపెనీల్లో ఈక్విటీ షేర్ల ట్రేడింగ్‌ జరుగుతున్న తీరు, ధరలు మారుతున్న వైనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు సెబీ అధికారి ఒకరు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News