: శారీరక పటుత్వం కావాలా? అయితే ఉడుం 'పట్టు'.. తమిళనాడులో వెర్రెత్తిపోతున్న ప్రచారం!


ఉడుము గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాని బలం సామాన్యమైదని కాదని, పూర్వకాలంలో రాజులు ఉడుముల సాయంతో కోట గోడలను సులభంగా ఎక్కేవారని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దాని మాంసం ఎంతో బలవర్ధకమని, నడుం నొప్పికి చక్కని ఔషధంలా పనిచేస్తుందన్న ప్రచారం కూడా ఉంది. ఈ కారణంగానే ఉడుములకు డిమాండ్ పెరిగింది. అయితే వీటిని విక్రయించడం నేరమని పేర్కొంటూ పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఉడుం మాంసంతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయన్న విషయాన్ని పక్కనపెడితే తాజాగా తమిళనాడులో ఉడుం రక్తంపై ప్రచారం విపరీత పోకడలకు పోతోంది. ఉడుములపై ఉన్న అపోహలను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఉడుము రక్తానికి ఎంత బలముందో తెలుసుకోవాలంటే తమ వద్దకు రావాలంటూ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. తమ వద్దకు వచ్చిన వారికి ఉడుమును చంపి దాని రక్తాన్ని గ్లాసులో సగం వరకు పోసి ఇస్తున్నారు. మిగతా సగంలో సోడా కలిపి కూల్‌డ్రింక్ తాగినంత ఈజీగా జనాలు గటగటా తాగేస్తున్నారు. ఉడుము రక్తం తాగితే నరాల పటుత్వం పెరుగుతుందని, సామర్థ్యం రెండింతలు అవుతుందన్న నమ్మకంతో రక్తం తాగేందుకు పలువురు ఎగబడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News