: గుంటూరు జిల్లా బాపట్లలో దారుణం.. తల్లీకూతుళ్ల హత్య.. ఆస్తి వివాదాలే కారణం!
గుంటూరు జిల్లా బాపట్లలోని నరాలశెట్టివారిపాలెంలో దారుణం చోటుచేసుకుంది. తల్లీకూతుళ్ల హత్య సంచలనం సృష్టించింది. గుర్తు తెలియని దుండగులు తల్లి నాగమణి, కుమార్తె సాయిలక్ష్మిని అతి దారుణంగా హత్య చేశారు. వారి కుమారుడు సందీప్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్తివివాదాలే ఈ హత్యలకు కారణం అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.