: పొరపాటున పిడకలు తొక్కినందుకు బాలుడి చేతి వేలుని కట్ చేశాడు!
బయట ఆరపెట్టిన పిడకలను పొరపాటున తొక్కిన దళిత బాలుడి చేతి వేలిని కట్ చేసిన విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హరిద్వార్ జిల్లాలోని జరిగిన ఈ సంఘటన వివరాలు. ఆర్యన్ అనే దళిత బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి ఆటలాడుకుంటున్న సమయంలో, రమేశ్ కుమార్ అనే అరవై సంవత్సరాల వ్యక్తి ఇంటి ముందు ఆరబెట్టిన పిడకలను తనకు తెలియకుండానే ఆ బాలుడు తొక్కాడు. దీంతో, ఆగ్రహించిన రమేష్, ఆ బాలుడి ఎడమ చేతి చిటికిన వేలును కట్ చేసి పారేశాడు. బాలుడి తండ్రి రోహ్ తస్ కుమార్ ఫిర్యాదు మేర, రమేశ్ కుమార్ తో పాటు అతని కొడుకు షుభమ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.