: టాటా గ్రూప్ కోసం మిస్త్రీ తన కుటుంబాన్ని కూడా త్యాగం చేశారు: ఎంపీ సుప్రియా సూలే
టాటా గ్రూప్ కోసం సైరస్ మిస్త్రీ తన కుటుంబాన్ని కూడా త్యాగం చేశారని మహారాష్ట్ర మహిళా ఎంపీ సుప్రియా సూలే అన్నారు. టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి ఆయన్ని పక్కకు తప్పించడంపై మిస్త్రీ కుటుంబ స్నేహితురాలైన సుప్రియా స్పందిస్తూ, పనితీరు బాగాలేదని చెబుతూ చైర్మన్ పదవి నుంచి ఆయన్ని తొలగించడం సబబు కాదన్నారు. మిస్త్రీ, ఆయన భార్య రోహికా చాగ్లాలు తనకు మంచి మిత్రులని చెప్పిన ఆమె, టాటా గ్రూప్ కోసం వాళ్లిద్దరూ ఎంతగానో కష్టపడ్డారని అన్నారు.