: పాక్ లోని 93 మదర్సాలకు ‘ఉగ్ర’ సంస్థలతో సంబంధాలు
పాకిస్థాన్ లోని 93 మదర్సాలకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు సింథ్ ప్రావిన్స్ లోని పరిస్థితులపై సర్వే చేయగా అక్కడి మదర్సాలకు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు తేలింది. సదరు సర్వేను సింథ్ ప్రాంత ముఖ్యమంత్రి మురాద్ అలీషాకు అందజేశారు. దీంతో, ఆయా మదర్సాలన్నింటిపైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈరోజు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాక్ రేంజర్స్ డైరెక్టర్ జనరల్ మేనేజర్ బిలాల్ అక్బర్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.