: 25 వేళ్లతో జన్మించిన మగబిడ్డ
కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో 25 వేళ్లతో ఉన్న ఒక మగబిడ్డ జన్మించాడు. ఇక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిరిసిల్లకు చెందిన రూపా అనే మహిళ ఈ బాలుడికి జన్మనిచ్చింది. కుడి చేతికి 7, ఎడమ చేతికి 6, రెండు కాళ్లకు 6 వేళ్లు చొప్పున ఉన్నాయి. కాగా, ఈ వింత శిశువును చూసేందుకు ఆసుపత్రిలోని వారు, సమీప గ్రామాల వారు ఆసక్తి చూపుతున్నారు.