: వచ్చే నెల 10న నిర్వహించనున్న బహిరంగ సభకు పేరు ఖరారు చేసిన పవన్ కల్యాణ్


జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ వచ్చేనెల 10న అనంతపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేయ‌నున్నట్లు ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ స‌భ‌కు ఈ రోజు ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరు పెట్టారు. ‘సీమాంధ్ర హక్కుల చైతన్య సభ’గా ఆయ‌న పేర్కొన్నారు. ఇక‌ పవన్ కల్యాణ్ సభా ప్రాంగణానికి ‘తరిమెల నాగిరెడ్డి ప్రాంగణం’గా పేరు ఖ‌రారు చేశారు. వ‌చ్చేనెల‌ 10 వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ సభ నిర్వహించనున్నారు. పార్టీ విస్తరణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అంశాలపై ఆయన ప్రధానంగా ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే ప‌వ‌న్ క‌ల్యాణ్ రెండు బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించి రెండిట్లోనూ ప్ర‌ధానంగా ఏపీకి ప్ర‌త్యేక హోదాపైనే మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ సారి ఆయన ఎవరిని ప్రశ్నిస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News