: సిర్సా ఎయిర్‌బేస్‌లో వైమానిక దళ అధికారి అనుమానాస్పద మృతి
వైమానిక దళానికి చెందిన ఓ అధికారి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన హరియాణాలోని సిర్సా ఎయిర్‌బేస్‌లో చోటు చేసుకుంది. అతడి మృతదేహంపై అక్కడి అధికారులు తూటా గాయాలను గుర్తించారు. ఆ అధికారి వింగ్ కమాండర్. ఆయన సిర్సా ఎయిర్‌బేస్ సెక్యురిటీ ఇన్ ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా? అనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.