: ఆ రెండు సినిమాలు పాకిస్థాన్ లో విడుదల కావడం లేదు: తరణ్ ఆదర్శ్
ఉరీ ఉగ్రదాడి అనంతరం అడ్డంకులెదుర్కొన్న బాలీవుడ్ సినిమా ‘యే దిల్ హై ముష్కిల్’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో దర్శక నిర్మాత కరణ్ జొహర్, రణ్ బీర్ కపూర్, అనుష్క శర్మ, ఐశ్వర్యారాయ్ బచ్చన్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో పాక్ నటుల సినిమాలు విడుదలవుతుండడం పట్ల పాక్ థియేటర్ యాజమాన్యం స్పందిస్తూ, పాక్ లో భారత్ సినిమాలపై నిషేధం ఎత్తివేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే అలాంటిదేమీ లేదని పాకిస్థాన్ లో ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాకు ఎదురుదెబ్బ తగిలిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తెలిపాడు. పాకిస్థాన్ లో ఈ సినిమా విడుదల కావడం లేదని పేర్కొన్నాడు. ఈ సినిమాతో పాటు అజయ్ దేవ్గణ్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ‘శివాయ్’ కూడా పాకిస్తాన్ లో విడుదలకు నోచుకోవడం లేదని ఆయన ప్రకటించాడు. ఈ విషయాన్ని ఫాక్స్ స్టార్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ తెలియజేసినట్లు ఆయన వెల్లడించాడు.