: స్విస్‌ ఛాలెంజ్‌ విధానానికి సంబంధించి కొత్త నోటిఫికేషన్‌ ఇస్తామని హైకోర్టుకు తెలిపిన ఏపీ సర్కారు


ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న స్విస్‌ ఛాలెంజ్ విధానంపై అభ్యంతరాలు తెలుపుతూ పలువురు హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ విధానంపై హైకోర్టు తాత్కాలిక స్టే విధిస్తున్న‌ట్లు పేర్కొన‌డంతో న్యాయ‌స్థానం నిర్ణ‌యంపై ఏపీ స‌ర్కారు రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ రోజు హైకోర్టులో దీనిపై విచార‌ణ జ‌రిగింది. ఈ అంశంలో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఏపీ ప్రభుత్వం న్యాయ‌స్థానానికి తెలిపింది. ఏపీఐడీఈ చట్టానికి సవరణ చేసినట్లు, స్విస్‌ ఛాలెంజ్‌ విధానం కోసం ఇచ్చిన పాత నోటిఫికేషన్‌ ప్రక్రియను నిలిపివేసి మ‌ళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇస్తామ‌ని చెప్పింది.

  • Loading...

More Telugu News