: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 255 పాయింట్లు నష్టపోయి 27,837 పాయింట్ల వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 8,615 పాయింట్ల వద్ద ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో మారుతి సుజుకి, కోటక్ మహీంద్రా, భారతి ఎయిర్ టెల్, ఐడియా సెల్యూలర్, హీరో మోటో కార్ప్ మొదలైన సంస్థల షేర్లు లాభపడగా; టాటా మోటార్స్ (డీ), టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మొదలైన కంపెనీల షేర్లు నష్టపోయాయి.