: ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో మొదటి రౌండ్ లో పీవీ సింధు విజయం


ఒలింపిక్స్ లో రజత పతక విజేత, తెలుగు తేజం సింధు ఇటీవలే డెన్మార్క్ ఓపెన్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రౌండ్‌లో అభిమానుల‌కు నిరాశ క‌లిగించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం సింధు ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో పాల్గొంటోంది. మహిళల సింగిల్స్‌ లో యిన్‌ పిప్‌ (హాంకాంగ్‌)తో తొలి రౌండ్లో ఈజీగా గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. 21-9, 29-27 తేడాతో హాంకాంగ్ క్రీడాకారిణిని ఓడించింది. మ‌రోవైపు డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో మెన్స్‌ సింగిల్స్‌ తొలి రౌండ్లో భారత ఆటగాడు హెచ్‌ఎస్‌ ప్రణయ్ మంచి విజ‌యాలు న‌మోదు చేసుకొని ప్రీ క్వార్టర్స్ లోకి ప్ర‌వేశించాడు. ఈ రోజు సోన్సానా (థాయ్‌లాండ్‌)తో పోరాడిన ప్రణయ్‌ 21-16, 21-18 తేడాతో అత‌డిని ఓడించాడు.

  • Loading...

More Telugu News