: జోరు పెంచిన కివీస్ ఆటగాళ్లు 227/6
రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ ఆటగాళ్లు జోరు పెంచారు. ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్ (72), టామ్ లాథమ్ (39) శుభారంభం ఇవ్వగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (41), రాస్ టేలర్ (35) ఆకట్టుకున్నా భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. నీషమ్ (6), వాట్లింగ్ (13) దూకుడు పెంచే ప్రయత్నంలో పెవిలియన్ చేరారు. ఆన్టన్ డెవ్విచ్ (2)కు జతగా శాంటనర్ (0) క్రీజులో ఉన్నాడు. టీమిండియా బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు వికెట్లతో రాణించగా, అక్షర్ పటేల్, హార్డిక్ పాండ్య, ధవల్ కులకర్ణి చెరో వికెట్ తీశారు. 46 ఓవర్లు ముగిసేసరికి కివీస్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.