: యడ్యూరప్పకు క్లీన్ చిట్ ఎందుకొచ్చిందో చెప్పిన సీఎం సిద్ధరామయ్య
అవినీతి ఆరోపణల కేసులో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. సరైన సాక్ష్యాధారాలు లేకనే యడ్యూరప్పను సీబీఐ కోర్టు నిర్దోషిగా ప్రకటించిందని ఆయన అన్నారు. క్లీన్ చిట్ వచ్చినంత మాత్రాన తప్పులేమీ చేయలేదంటూ ఆయనకు ఆయన క్లీన్ చిట్ ఇచ్చుకోవడం సరికాదని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరో ప్రజలు నిర్ణయిస్తారని... యడ్యూరప్ప కానీ, బీజేపీ కానీ కాదని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు, ఎవరెన్ని కుట్రలు పన్నినా... చివరకు న్యాయమే గెలిచిందని యడ్యూరప్ప ట్వీట్ చేశారు.