: మూడో వికెట్ కోల్పోయిన కివీస్


న్యూజిలాండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్లు గుప్తిల్ (72), లాంథమ్ (39) శుభారంభాన్ని ఇచ్చారు. 96 పరుగుల వద్ద లాంథమ్ అవుట్ కాగా, విలియమ్సన్ సహకారంతో గుప్తిల్ అర్ధసెంచరీతో రాణించి ఆకట్టుకున్నాడు. అనంతరం 138 పరుగుల వద్ద గుప్తిల్ కూడా వెనుదిరగడంతో రాస్ టేలర్ సహకారంతో కెప్టెన్ విలియమ్సన్ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అయితే 184 పరుగుల వద్ద విలియమ్సన్ (41) ను మిశ్రా అవుట్ చేశాడు. దీంతో రాస్ టేలర్ (20) కు నీషమ్ (2) జత కలిశాడు. దీంతో 37 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన కివీస్ 188 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, హార్డిక్ పాండ్య చెరో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News