: 'సర్కార్ 3' నిర్మాణంపై రామ్ గోపాల్ వర్మకు నోటీసులు


తన క్రియేటివిటీతో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సహజీవనం చేస్తూనే ఉంటాడు. తాజాగా ఇప్పుడు మరో వివాదం వర్మ తలుపు తట్టింది. బాలీవుడ్ లో సర్కార్, సర్కార్ రాజ్ సినిమాలతో ఇప్పటికే ఘన విజయం సాధించిన వర్మ... మరో సీక్వెల్ లో భాగంగా 'సర్కార్ 3' సినిమాను రూపొందిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. అయితే, సర్కార్ కు సీక్వెల్ నిర్మించే హక్కు వర్మకు లేదంటూ నరేంద్ర హిరావత్ అనే వ్యక్తి నోటీసులు పంపించాడు. సర్కార్ సినిమాకు చెందిన హక్కులన్నీ తనవేనని... సీక్వెల్ తీయాలన్నా, రీమేక్ చేయాలన్నా తన అనుమతి తీసుకోవాల్సిందే అని నోటీసులో పేర్కొన్నాడు. తనను సంప్రదించకుండానే రామ్ గోపాల్ వర్మ సర్కార్ 3 సినిమా స్టార్ట్ చేశాడని... వెంటనే తనతో మాట్లాడకపోతే వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు.

  • Loading...

More Telugu News