: న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో భారత్‌కు సభ్యత్వంపై మా మద్దతు ఉంటుంది: న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ
న్యూజిలాండ్ ప్రధాని జాన్‌కీ భారత పర్యటన సందర్భంగా ఈ రోజు ఆయనతో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు మాట్లాడారు. జాన్ కీ మాట్లాడుతూ.. అణు సరఫరాదారుల బృందం (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్)లో భారత్‌కు సభ్యత్వంపై మోదీతో తాము చర్చించినట్లు తెలిపారు. ఈ అంశంపై తాము భారత్ ప్రాధాన్యతను గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఇండియాతో తమ దేశం సత్సంబంధాలు కొనసాగిస్తుందని అన్నారు. నరేంద్ర మోదీ మాట్లాడుతూ... ఉగ్రవాదం ఒక్క దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికే సమస్యగా ఉందని చెప్పారు. స్టార్టప్ బేస్‌లో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతోందని అన్నారు. భారత్, న్యూజిలాండ్ మధ్య ఉన్న ప్రధాన సమస్యలపై తాను ఆ దేశ ప్రధానితో చర్చించినట్లు మోదీ పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, డైరీ, వ్యవసాయ సంబంధిత అంశాలపై చర్చలు జరిగాయని తెలిపారు.