: రాణించిన కివీస్ బ్యాట్స్ మన్ 142/2
కివీస్ బ్యాట్స్ మన్ గాడినపడ్డారు. నేడు జరుగుతున్న నాలుగో వన్డేలో గుప్తిల్ రాణించాడు. ఫాం లేమితో నానాతంటాలు పడుతున్న గుప్తిల్ (72) ఆకట్టుకున్నాడు. ఆరంభం నుంచి లాంథమ్ (39) తో కలిసి గుప్తిల్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ క్రమంలో 7.1 ఓవర్ కు అర్ధ సెంచరీ మార్కు చేరుకున్న అనంతరం లాంథమ్ రహనేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా, విలియమ్స్ కు జతకలిసిన గుప్తిల్ జట్టు స్కోరును 17.2 ఓవర్లలో 100 మార్కును దాటించాడు. అనంతరం 138 పరుగుల వద్ద గుప్తిల్ ధోనీకి క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో విలియమ్సన్ (17) కు రాస్ టేలర్ (3) జతకలిశాడు. దీంతో 27 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు 142 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో పటేల్, పాండ్య చెరో వికెట్ తీశారు.