: వొడాఫోన్ కు రూ. 37 కోట్ల జరిమానా!


ప్రపంచ టెలికాం దిగ్గజం వొడాఫోన్ కు భారీ జరిమానా పడింది. కస్టమర్ ఫిర్యాదులను సరిగా హ్యాండిల్ చేయకపోవడంతో, ఆ కంపెనీపై బ్రిటన్ రెగ్యులేటరీ 4.6 మిలియన్ పౌండ్ల (రూ.37 కోట్లకు పైగా) జరిమానా విధించింది. ఇప్పటి వరకు రెండు సార్లు విచారణ చేపట్టిన అనంతరం రెగ్యులేటరీ ఈ నిర్ణయం తీసుకుంది. జరిమానాను 20 పనిదినాల్లోపు చెల్లించాలని ఆదేశించింది. కస్టమర్ల న్యాయమైన ఫిర్యాదులను సరైన పద్ధతిలో, వెంటనే పరిష్కరించడంలో వొడాఫోన్ విఫలమైందని ఈ సందర్భంగా రెగ్యులేటరీ వ్యాఖ్యానించింది. కస్టమర్లకు అందించే సేవల్లో విఫలమైతే తాము చాలా సీరియస్ గా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా ఇతర టెలికాం కంపెనీలను కూడా రెగ్యులేటరీ హెచ్చరించింది. మరోవైపు, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా వొడాఫోన్ కు గుర్తింపు ఉంది.

  • Loading...

More Telugu News